English   

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో రష్మిక

ntr
2020-02-24 05:01:12

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ ఏమో అల వైకుంటపురంలో సినిమా పూర్తి చేసి ఖాళీగా ఉన్నారు. ఇక  ‘అరవింద సమేత’ తరవాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ మరోసారి కలిసి పనిచేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి  వెళ్లనుంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ప్రకటన కూడా వెలువడింది. అయితే ఇందులో నాయికగా ఎవరిని ఎంచుకుంటారన్న ఆసక్తి నెలకొంది. అయితే ఆ పాత్ర కోసం రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ విషయం మీద కొంత హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఈ విషయమై తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ కొద్ది సేపటికే దానిని డిలీట్ చేశారు.  ఒకవేళ ఇదే నిజమైతే, రష్మిక మరో జాక్‌పాట్‌ కొట్టినట్లే. తన సినిమాల్లో త్రివిక్రమ్ హీరోయిన్లకు పెద్ద పీట వేస్తుంటాడు. ఈ సినిమాలో కూడా రష్మిక క్యారెక్టర్ క్లిక్ అయితే ఆమె కెరీర్ కి తిరుగుండదు. ప్రస్తుతం రష్మిక.. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. మరి రష్మికని రోప్ చెయడ నిజమేనా, కాదా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

More Related Stories