English   

మహేష్ బాబు గారూ.. మీరే ఇలా చేస్తే ఎలా..

mb
2020-02-24 07:28:14

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొందరు దర్శకులు మహేష్ బాబును సూటిగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కమిట్ అయిన తర్వాత సినిమాలు ఉన్నపలంగా వద్దనుకోవడం ఏంటో అర్థం కావడం లేదంటూ వాళ్లు జుట్టు పీక్కుంటున్నారు. పోనీ కాదనుకుంటున్న దర్శకులు చిన్నవాళ్లైతే ఏమో అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద దర్శకులను కూడా మహేష్ హర్ట్ చేస్తున్నాడు. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత దర్శకుడు సుకుమార్ తో పని చేయడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపించారు. కానీ ఈయన మాత్రం మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాసాడు. ఆయన కోసం ఆర్నెళ్లకు పైగా వేచి చూసాడు. తీరా మహర్షి సినిమా తర్వాత తనకు ఎమోషనల్ సినిమాలు చేసి బోర్ కొట్టేసింది.. కాస్త ఎంటర్ టైన్మెంట్ కావాలని సరిలేరు నీకెవ్వరు అంటూ అనిల్ రావిపూడికి ఓటేసాడు. దాంతో సుకుమార్ అప్పటి వరకు వేచి చూసి తర్వాత అల్లు అర్జున్ వైపు వచ్చేసాడు. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి విషయంలో కూడా ఇదే చేసాడు సూపర్ స్టార్. ఈయనతో సినిమా కూడా కన్ఫర్మ్ అయి.. నేడో రేపో లాంఛ్ అవుతుందనుకున్న సమయంలో ఇప్పుడు ఆపేసినట్లు తెలుస్తుంది. ఈయన్ని కాదని గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ కు ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో మహేష్ బాబు ఆఫర్ ఇచ్చినా కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యేంతవరకు కూడా ఆ టెన్షన్ దర్శకుల్లో కనిపిస్తుంది. ఇది మంచిది కాదంటూ మహేష్ బాబుకు కొందరు హితవు పలుకుతున్నారు. కానీ మహేష్ మాత్రం కథ నచ్చకపోతే నిర్దాక్షణ్యంగా పక్కన బెట్టేస్తున్నాడు.

More Related Stories