జబర్దస్త్ నుంచి అనసూయ ఔట్.. సోషల్ మీడియాలో వార్తలు..

జబర్దస్త్ కామెడీ షో నుంచి అనసూయ బయటికి వచ్చేస్తుందా.. ప్రస్తుతం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఇవే అనుమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగబాబు బయటికి వచ్చిన తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో ఎవరు ఎప్పుడు బయటికొచ్చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏడేళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా నడిచిన జబర్దస్త్ కామెడీ షో.. నాగబాబు బయటికి వచ్చిన తర్వాత చాలా రోజులపాటు వార్తల్లో నిలిచింది. చమ్మక్ చంద్ర లాంటి స్టార్ టీం లీడర్ అందులోంచి బయటకు రావడం నిజంగానే సంచలనం. ఆయనతో పాటు ఇంకా చాలామంది బయటకు వస్తారు అని ప్రచారం జరిగినా కూడా అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కామెడీ షోకు రావాలని ఆలోచిస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో హాట్ యాంకర్ అనసూయ భరధ్వాజ్ జబర్దస్త్ కామెడీ షోను వదిలిపెట్టి వెళ్లి పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలతో పాటు వరసగా షోలు కూడా చేస్తుంది. ఈ మధ్య ప్రతిరోజూ పండగే అంటూ ఒక డైలీ షో కూడా మొదలు పెట్టింది అనసూయ. దాంతోపాటే లోకల్ గ్యాంగ్స్ అనే మరో షో కూడా చేస్తుంది. వీటితోపాటు సినిమాల్లో నటిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య జబర్దస్త్ కామెడీ షోకు అనసూయ డేట్స్ సరిగా ఇవ్వలేకపోతోందనే ప్రచారం జరుగుతుంది. దాంతో కొన్ని రోజులు ఈ షో కు దూరంగా ఉండాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అనసూయ నిజంగానే తప్పుకుంటే ఆమె స్థానంలో శ్రీముఖి తీసుకోవాలని ఆలోచిస్తోంది మల్లెమాల ప్రొడక్షన్స్.