English   

నాని సినిమా ఆ దర్శకుడితోనేనా ..

 Nani
2020-02-24 11:27:06

నాచురల్ స్టార్ నాని అభిమానులకు ఈరోజు సర్ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న నాని మరో సినిమా ఒప్పుకున్నాడు. సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్ మీద పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. నానికి ఇది 27వ సినిమా. ఈ చిత్ర టైటిల్‌ను రేపు ప్రకటించనుంది చిత్ర బృందం. దీంతోపాటు కాన్సెప్ట్‌ వీడియోను సిద్ధం చేశారు. 

నిజానికి ఒక్కో సారి దర్శకులు మంచి సినిమాలతో వచ్చినా వారికి ఎందుకో కానీ ఆ తర్వాత సినిమాలు ఉండవు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్, టాక్సీవాలా దర్శకుడు రాహుల్ లు కూడా మంచి సినిమాలు అందించినా వారికి తర్వాత సినిమలు లేకుండా పోయాయి. ఇప్పుడు రాహుల్ దర్శకత్వంలోనే నేచురల్ స్టార్ నానీ ఈ సినిమా కమిట్ అయ్యాడని సమాచారం. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి అధికారిక సమాచారం సాయంత్రం వెలువడనుంది.

More Related Stories