English   

జయలలితగా పరకాయ ప్రవేశం చేసిన కంగనా

Kangana Ranaut
2020-02-24 11:35:58

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని బాషలలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు సంబంధించిన వారి జీవిత చరిత్రను తెరపై చూపించి హిట్స్ కొడుతున్నారు. ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కూడా సినిమా తీస్తున్నారు. ‘తళైవి’ పేరుతో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీంట్లో జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంగన జయ పాత్రలో ఉన్న రెండు లుక్స్ కి మంచి స్పందన రాగా ఈరోజు జయలలిత 72వ జయంతి సందర్భంగా తాజాగా మరో లుక్‌ను విడుదల చేసింది యూనిట్. 

ఈ లుక్‌లో జయలలిత యంగ్ ఏజ్‌లో అంటే రాజీకయ రంగప్రవేశం చేసినప్పటి పిక్. ఇక కంగన జయలలిత రూపంలో ఆకట్టుకుంటోంది. నిజానికి హీరోయిన్ గా ఉన్న సమయంలో నటుడు శోభన్ బాబుతో  జయకు మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఆసక్తిగా చూసేవారు. అందుకే ఈ మూవీలో ఆయనకు, జయలలితకు మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయట. ఆ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టు సమాచారం. ఆయన పాత్రకు జిషు న్యాయం చేయగలడని భావించి అతన్ని ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. జిషు ఇటీవల తెలుగులో వచ్చిన ‘అశ్వద్ధామ’లో విలన్‌ పాత్రలో నటించాడు. ఇప్పుడు ఈయనే శోభన్ బాబు క్యారెక్టర్ చేయనున్నాడట.

More Related Stories