భీష్మ వీకెండ్ కలెక్షన్స్ ..గట్టిగానే కొడుతున్నాడు

కుర్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక మందన్న జంటగా నటించిన వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా 'భీష్మ'. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ మాత్రమే కాక మౌత్ టాక్ కూడా బాగుండడంతో సినిమా మొదటి రోజు నుండి మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అన్నీ సెక్షన్ల ఆడియన్సుకు కనెక్ట్ కావడతో కలెక్షన్స్ ఇంకా జోరు పెరుగుతోంది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్లకు పైగా షేర్ సాధించిన 'భీష్మ' రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరు కొనసాగించింది. రెండవ రోజు దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేయడంతో రెండు రోజుల కలెక్షన్లు పది కోట్లు దాటాయి. ఇక మూడవ రోజు అయిన నిన్న కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇక భీష్మ మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ని చూస్తే నైజాం 6.02 కోట్లు, సీడెడ్ 2.1 కోట్లు, గుంటూరు 1.5 కోట్లు, ఉత్తరాంధ్ర 1.8 కోట్లు, తూర్పు గోదావరి 1.2 కోట్లు, పశ్చిమ గోదావరి 88.5 లక్షలు, కృష్ణ 99 లక్షలు, నెల్లూరు 48 లక్షలు, భీష్మ ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 14.97 కోట్లు, ఇండియా మొత్తంమరో1.65 కోట్లు, ఓవర్సీస్ – 2.33 కోట్లు, వరల్డ్ వైడ్ భీష్మ ఫస్ట్ వీక్ షేర్ – 18.95 కోట్లు అని తేలింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాలతో పోటీ లేకపోవడం.. ఈ సినిమా అన్నీ వర్గాలను మెప్పించే సినిమా కాబట్టి లాంగ్ రన్లో భారీ వసూళ్లు తీసుకురావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.