English   

నయనతార.. నీకు మరీ ఇంత స్వార్థం పనికిరాదు..

Nayanthara
2020-02-24 15:13:45

ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ తీరు చూసిన తర్వాత దర్శక నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నయనతార ఇమేజ్ ఇంత కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పోటీ పడుతుంటారు. ఒక్కో సినిమా కోసం 5 నుంచి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. సౌతిండియాలో మరే హీరోయిన్ కూడా ఇంత పారితోషికం అందుకోవడం లేదు. 

అయితే ఇంత చేసినా కూడా ఒక్క సినిమా కోసం చాలా కండీషన్లు పెడుతుంది నయనతార. తమిళ నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మపై చాలా సీరియస్ అవుతున్నారు. ఇన్నేసి కోట్లు తీసుకుని కనీసం ప్రమోషన్ కూడా రాదు అంటూ ఆమెపై మండి పడుతున్నారు. దానికితోడు షూటింగ్ అనుకున్న దానికంటే ఒక రోజు ఆలస్యంగా అయినా కూడా ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తుందని నయనతార పై విమర్శలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈమె తన ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. నేను రౌడీనే సినిమా తర్వాత మరోసారి ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాలో సమంత అక్కినేని మరో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక ఈ సినిమా కోసం నయనతార మిగిలిన సినిమాల కంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సరే అది తన ప్రియుడి కోసం చేస్తుంది అనుకోవచ్చు. కానీ ఈ సినిమా ప్రమోషన్ కూడా నయనతార వస్తుందని ప్రచారం జరుగుతుంది. అన్నీ దగ్గరుండి చూసుకుంటానని దర్శకుడు విఘ్నేష్ శివన్ కు నయనతార ధైర్యం చెప్పిందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియుడి సినిమాకు మాత్రం ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ఒప్పుకున్న నయనతార మిగిలిన నిర్మాతలను మాత్రం ముప్పు తిప్పలు పెడుతుంది అనే విమర్శలను ఈ భామ మూట కట్టుకోవలసి వస్తుంది. 

ఏదైనా కూడా ప్రియుడి సినిమాకు నయనతార ప్రమోషన్ చేస్తే మాత్రం తన కెరీర్ కు తానే ఇబ్బందులు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ నిర్ణయం చూసిన తర్వాత నయనతార మీకు మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈమెను విమర్శిస్తున్నారు. 

More Related Stories