ఆ ఇద్దరు హీరోల పేర్లను బయట పెట్టిన నిమ్మగడ్డ...

ఒకప్పుడు మా టీవీ పార్టనర్ లలో ఒకరు, సినిమా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం సెర్బియా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఆయనను అక్కడ నిర్భందించారు ఇంటర్ పోల్ పోలీసులు. అయితే రస్ అల్ ఖైమా సొమ్మును తాను ఎవరికి ఇచ్చింది, నిమ్మగడ్డ సెర్బియా పోలీసులకు వెల్లడించినట్లు ఒక ప్రచారం జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశాన్ని ఎలా టార్గెట్ చేయాలా అని కాన్సంట్రేట్ చేసి మరీ చుక్కలు చూపించడానికి ప్రయత్నం చేస్తోంది. మరో పక్క టీడీపీ ఏమో జగన్ మీద ఆయన సన్నిహితులపై ఉన్న కేసులు ఫోకస్ చేస్తోంది. నిమ్మగడ్డ, రస్ అల్ ఖైమాకు జగన్ పేరును చెప్పినందుకే ఆయన దేశం విడిచి వెళ్లడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది.
అయితే ఇప్పుడు నిమ్మగడ్డ ఇద్దరు సినీ హీరోల పేర్లను వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ అగ్ర హీరో, అలాగే గతంలో నిమ్మగడ్డతో వ్యాపారం చేసిన మరో అగ్ర హీరో పేరు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.