English   

ఆ సంగీత దర్శకుడికి చెమటలు పట్టించిన పవన్ కళ్యాణ్..

pk
2020-02-25 19:57:03

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. రెండింటికి సమయం కేటాయిస్తూ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇక ఈయన కోసం దర్శక నిర్మాతలు కూడా సపరేట్ ఫ్లైట్ ఇచ్చి మరి షూటింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు పవర్ స్టార్. నానితో ఎంసీఏ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారి పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు తమన్. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు చెప్పాడు తమన్. తాను ఈ సినిమాకు సంగీతం అందించాలని తెలిసిన తర్వాత కథ గురించి చర్చించడానికి పవన్ ఇంటికి వెళ్ళాడు ఈ సంగీత దర్శకుడు. అప్పటి అనుభవాలను ఇప్పుడు మీడియాలో పంచుకున్నాడు తమన్.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ వచ్చిన రోజు తనకు కలగా కనిపించిందని.. ఎప్పటి నుంచో అయనతో సినిమా చేయాలనీ.. ఆయన సినిమాకు సంగీతం అందించాలని అనుకున్నానని తెలిపాడు. తాను ఇప్పటి వరకు కంపోజ్ చేసిన పాటలన్ని పవన్ కు వినిపించానని చెప్పాడు తమన్. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని తాను చాలా కంగారు పడినట్లు చెప్పుకొచ్చాడు ఈయన. అప్పుడు తనకు చెమటలు కూడా పట్టాయని.. అయితే అది భయం వాళ్ళ కాదని చెప్పాడు. పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమ.. ఆ సమయంలో తనపై ఉన్న ఒత్తిడి ఆ చెమటకు కారణం అని చెప్పాడు. మొత్తానికి పింక్ రీమేక్ సినిమాకు పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు తమన్. ఈ సినిమా మ్యూజిక్ అద్భుతంగా వస్తుందని చెప్పాడు.

More Related Stories