ఆ సినిమాలకు ప్రమోట్ చేసిన జగన్...ఇదేం లాజిక్కో

తాజాగా ఏపీ సీఎం జగన్ కి సంబందించిన ఒక ప్రచారం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. అసలు విషయం ఏంటంటే ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన వ్యాసం జగన్ ప్రభుత్వంపై ఒకపక్క ఏకి పదేస్తూనే మరో ఆసక్తికర అంశాన్ని బయట పెట్టింది. సదరు వ్యాసంలో జగన్ ప్రభుత్వం తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తున్నట్టు రాశారు. అదెలా అంటే సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాలను జగన్ పనిగట్టుకుని ప్రజలకు డబ్బులిచ్చి చూసేలా ప్రోత్సహించారట అదే ఈ పత్రిక లో వచ్చిన వ్యాసం సారాంశం. జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం వల్ల పేదల పిల్లలకు మెరుగైన విద్య లభిస్తుందా? లేదా అనే విషయం పక్కన పెడితే ఆ డబ్బు వలన సంక్రాంతికి రిలీజయిన రెండు బాగా ఆడాయని ఆ వ్యాసం పేర్కొంది. నిజానికి సంక్రాంతి పండుగకు ముందు అమ్మ ఓడి అంటూ లబ్ధిదారులకు 15 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆ డబ్బు వచ్చిపడటంతో అప్పుడే విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో'.. సినిమాలు ఆంధ్రాలో ఆశించిన దానికంటే ఎక్కువ విజయవంతం అయ్యాయని చెబుతున్నారు. జనం దగ్గర డబ్బు ఉందని గ్రహించిన బట్టల షాపుల వారు సైతం ఇచ్చే డిస్కౌంట్లను ఎత్తేశారని పేర్కొంది. అలా జగన్ సినిమాలను ప్రమోట్ చేశారని సదరు వ్యాసం సారాంశం.