English   

ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన టాలీవుడ్ నిర్మాతలు..

jagan
2020-02-26 19:56:22

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలంతా కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలిసారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా టాలీవుడ్ పై బాగానే కేర్ చూపిస్తున్నారు. వాళ్లు అడిగిన ప్రతీసారి కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఈ మధ్యే తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జునతో ప్రత్యేకంగా భేటీ కావడమే కాకుండా ఇక్కడి అభివృద్ధి గురించి కూడా చర్చించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు వెళ్లి ఈయన్ని కలిసారు. సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్, వల్లభనేని వంశీ తదితరులు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ ఆఫీస్ వెళ్ళారు. అక్కడే జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. అందులోనే ఇండస్ట్రీ విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నాయి. భేటీ ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు తెలిపారు.

తాము సిఎంను కలవడానికి ప్రత్యేకమైన కారణం ఉందని.. అందుకే ఆయన్ని కలిసామని చెప్పారు. ఆరేళ్ల కింద విశాఖపట్నంలో హుధ్‌హుధ్ ధాటికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో రోడ్డున పడ్డారు. దానికోసం సినీ పరిశ్రమ అప్పట్లో పెద్ద ప్రోగ్రామ్ చేసింది. దాంతో కొన్ని నిధులు సేకరించింది. దాదాపు 15 కోట్ల వరకు ఈ నిధులు వచ్చాయి. వాటిని పోగుచేసి బాధితులకు కొన్ని ఇళ్లను కూడా నిర్మించారు. ఇప్పుడు ఆ గృహసముదాయాన్ని ఓపెనింగ్ చేయడానికి జగన్‌ను కలిసి ఆహ్వానించారు నిర్మాతలు. దీనికి సిఎం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా వచ్చి ఆయన ఈ మంచి పనిలో భాగం అవుతానని మాటిచ్చినట్లు తెలిపారు నిర్మాతలు.

More Related Stories