మహేష్ బాబుకు జగనన్న వసతి దీవెన...

కర్నూలు జిల్లాపై సినీ నటులకు ప్రేమ ఎక్కువా? లేక యాక్టర్లంటే అధికారులకు మక్కువా? ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు వసతి దీవెన పథకం ఎలా వచ్చింది.? అదీ ఒకటి కాదు ఏకంగా వేర్వేరు కాలేజీలకు చెందిన ఇద్దరు విద్యార్ధుల కార్డులపై మహేష్ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. మొన్నటికి మొన్న కర్నూలు నగరంలో నటుడు వెంకటేష్‌కు ఓటు ఉన్నట్టు ఆయన ఫోటోతో ఓటర్ ఐడి కార్డు బయటపడింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న విద్యా దీవెన కార్డుల్లో నటుడు మహేష్ బాబు ఫోటో దర్శనమిచ్చింది. లబ్దిదారుల ఫోటో స్థానంలో మహేష్ బాబు ఫోటో ఉంది. ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో బీకాం విద్యార్థి లక్ష్మికి జగనన్న వసతి దీవెన మంజూరైంది. కార్డులో మాత్రం మహేష్ బాబు ఫోటో ఉంది. పత్తికొండ వైష్ణవి డిగ్రీ కాలేజీలో లోకేష్ గౌడ్ విద్య దీవెన కార్డులోను ఇదే పరిస్థితి. లోకేష్ ఫోటో స్థానంలో మహేష్ బాబు ఫోటో ఉంది. లోపం ఎక్కడ ఉందో కానీ.. ప్రభుత్వం మంజూరు చేసే పత్రాలు.. కార్డుల్ల్లో.. గుడ్డిగా నటుల ఫోటోలను ముద్రించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.