English   

మరోసారి ఇంటివాడైన రాజీవ్ కనకాల... సంతోషంగా ఫ్యాన్స్...

Rajeev Kanakala.jpg
2020-02-26 21:45:30

అదేంటి.. ఆల్రెడీ పాతికేళ్ల కిందే సుమతో కలిసి ఇంటివాడు అయ్యాడు కదా మరో ఇంటివాడు కావడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఇందులో డబుల్ మీనింగ్స్ ఏమీ లేవు. సుమ, రాజీవ్ కనకాల కలిసి ఓ మంచి ఇల్లు కొన్నారు. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం కొన్ని కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది. దీనికోసం సుమతో పాటు రాజీవ్ కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్నారు. అయితే చాలా రోజుల కిందే ఇల్లు తీసుకున్నా కూడా గృహప్రవేశం మాత్రం ఇంకా జరగలేదు.

దానికి కారణం సుమ మామయ్య.. రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల మరణమే. ఇంట్లో పెద్దవాళ్లు పోయినపుడు ఏడాది వరకు కొత్తింట్లోకి వెళ్లకూడదనే నియమం ఉండటంతో ఇంకా ఇల్లు మారలేదు ఈ జంట. అయితే కొన్ని రోజులుగా సుమ, రాజీవ్ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. వాళ్లిద్దరి మధ్య ఒకప్పుడు ఉన్నంత బంధం ఇప్పుడు లేదనే వార్తలున్నాయి. కానీ దీనిపై రాజీవ్ కానీ.. సుమ కానీ ఎప్పుడూ బయటికి చెప్పలేదు.

ఇప్పుడు ఇల్లు తీసుకున్నారని.. కొత్తింట్లోకి మారబోతున్నారని తెలియడంతో అంతా బాగానే ఉందని అర్థమైపోతుంది. త్వరలోనే ఈ ఇంటి ఓపెనింగ్ గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

More Related Stories