English   

రవితేజ క సెంటిమెంట్ ఏమి చేస్తుందో

rt
2020-02-27 06:50:05

డిస్కో రాజా సినిమాతో పర్లేదనిపించుకున్న రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాలో నటించబోతున్నాడు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడు. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్న రమేష్‌ వర్మ చెప్పిన కథకి రవితేజ బాగా కనెక్ట్ అయ్యారట. క్రాక్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరానే మొదలు కానుంది. ఇక గోపీచంద్ మలినేని క్రాక్ మే 8న విడుదల కానుంది. ఈ చిత్రం పట్ల రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన కిక్ కూడా ఇదే తేదీన విడుదలైన నేపథ్యంలో కిక్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు. అలాగే రెండు చిత్రాల టైటిల్స్ కూడా ‘క’తోనే మొదలవ్వడంతో ఇక క్రాక్ సినిమా హిట్ అన్న భావనకు వచ్చేసారు. మరిప్పుడు ఈ కిలాడీ ఏమి చేస్తాడో మరి ?

More Related Stories