English   

ఆ ప్రచారం నిజం కాదు..వీసాల కోసమే వెయిటింగ్

Avasarala Srinivas
2020-02-27 16:52:47

కుర్ర హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమౌతున్నాడు. ఇటీవల వచ్చిన `అశ్వథ్థామ`ను ఎంతో అంచనాల మధ్య రిలీజ్ చేసినా అది కూడా నిరాశపరిచింది. అయితే శౌర్యను 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు అవసరాల శ్రీనివాస్ శౌర్యతో మరో సినిమా ప్రకటించాడు. అయితే ఆ సినిమా ప్రకటించి చాలా రోజులు అయినా దాని గురించిన వార్త ఇప్పటిదాకా బయటకి రాలేదు. 

ఇప్పటికే ఈ సినిమా అమెరికా షెడ్యూల్ చెయ్యాల్సి ఉండగా  వాయిదా మీద వాయిదా పడుతూ వస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా మించిపోవడంతో సినిమాను ఆపేస్తున్నర్నై ప్రచారం జరిగింది. అయితే పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా విషయం మీద తాజాగా క్లారిటీ ఇచ్చింది. చిత్ర షూటింగ్‌ 50 శాతం పూర్తయిందన్న మేకర్స్ మిగతా షూటింగ్‌ అమెరికాలో ప్లాన్ చేశామని వీసాల కోసమే వెయిటింగ్ అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు నిర్మాతలు. 

More Related Stories