English   

వరుణ్ తేజ్ కి విలన్ గా మరో హీరో 

Naveen chandra
2020-02-27 09:59:46

మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తాజా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు తాజాగా ప్రచారం మొదలయింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులో హీరోగా ఏంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర ఆ తరువాత పెద్దగా క్లిక్ కాలేక పోయాడు. అనంతరం నాని నటించిన నేను లోకల్  సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు నవీన్. 

ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సామెత వీరరాఘవ’ సినిమాలో కూడా ఎన్టీఆర్ కు విలన్ గా నవీన్ నటించి మంచి మార్కులు వేసుకున్నాడు. ఒకపక్క ఆయన హీరోగా సినిమాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న విలన్‌గా చేస్తున్నారు. తాజాగా ఒక నవీన్ తమిళ స్టార్ హీరో సినిమాలో కూడా విలన్‌గా నటించాడు. 

ఇక అల్లు బాబీ నిర్మిస్తున్న వరుణ్ తేజ్ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. ఆయనతో తలపడే విలన్ కూడా కథా పరంగా బాక్సర్ అయ్యుండాలి. అందువలన బాక్సింగ్ లో ప్రవేశమున్న నవీన్ చంద్ర అయితే సూట్ అవుతాడని ఆయనను విలన్ పాత్రకి ఎంపిక చేశారని అంటున్నారు. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో కూడా ఆయన జాయిన్ అవుతున్నట్టు చెబుతున్నారు. జూలై 30వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ని ఖరారు చేయాల్సి ఉంది.

More Related Stories