హిందీ ఖైదీలో ఆర్ఆర్ఆర్ స్టార్

కోలీవుడ్ హీరో కార్తి ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఖైదీ. గతేదాడి దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజయి ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది ఈ సినిమా. ఒక హీరోయిన్ లేకుండా ఒక పాట లేకుండా కమర్షియల్ సినిమాలి విభిననంగా పొందిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది.
ఈ సినిమా ఒరిజినల్ నిర్మాత యస్. ఆర్. ప్రభుతో కలసి రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే… ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ రీమేక్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజమౌళి ఆర్ఆర్ఆర్లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ `ఖైదీ` రీమేక్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషీయల్ ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి.