English   

మళ్ళీ వాయిదా పడ్డ బాలయ్య  బోయపాటి సినిమా

Balakrishna
2020-02-27 18:38:47

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా సెట్స్‌ పైకి నిన్నటి నుండే వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి జరగనుందని ప్రచారం జరిగింది. 

అయితే తాజాగా ఈ షెడ్యూల్ మళ్ళీ మారిందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ మార్చి 2న ప్రారంభం కానుంద‌ట‌. హైద‌రాబాద్ లో జ‌రిగే ఈ షెడ్యూల్ లో బాల‌కృష్ణ మేఅ కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రించ‌నున్నార‌ని చెబుతున్నారు. ఆపై వార‌ణాసి నేప‌థ్యంలో రెండవ షెడ్యూల్ ఉంటుంద‌ని అంటున్నారు. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని అంటున్నారు. ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని అంటున్నారు. 

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ హీరోయిన్స్ ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు జర్గుతుండగా తాజాగా శ్రియ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం శ్రియ ఓకే అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బహుశా ఈ సినిమా షూట్ కి వెళ్ళే లోపు ఆ విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Related Stories