English   

భీష్మ అసలు ఆగటం లేదుగా 

Bheeshma
2020-02-27 12:23:33

కుర్ర హీరో నితిన్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'భీష్మ' బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. పాజిటివ్ టాక్ తో పాటు మంచి రివ్యూస్ రావడంతో 'భీష్మ' కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో భీష్మ పరుగులు పెడుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసిన భీష్మ. ఆరో రోజు కూడా అదే రచ్చ కంటిన్యూ చేసింది. వీక్ లో మిడిల్ వర్కింగ్ డే అయినా వసూళ్ళలో ఎక్కడా డ్రాప్స్ కనిపించలేదు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజుకు గాను 1.2 కోట్ల మేర వసూలు చేసింది భీష్మ. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 1.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఆరో రోజు వసూళ్లు కూడా కలుపుకొని ఇప్పటికి 28.70 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. ఐదు రోజుల్లోనే భీష్మ ఈ మేర కలెక్షన్స్ రాబట్టడం, బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడంతో నిర్మాతలు మంచి జోష్ లో ఉన్నారు. ఇక మొన్న యూనిట్ అంతా కలిసి హైదరాబాద్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. 

More Related Stories