English   

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు చనిపోతాడంట..

Mahesh Babu chiru
2020-02-27 18:11:19

ఇంతకంటే సంచలనం అయితే మరోటి ఉండదు. ఎందుకంటే 20 ఏళ్ల కెరీర్ లో ఇప్పటి వరకు తన కెరీర్లో ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా మహేష్ చనిపోయే పాత్ర చేయలేదు. ఎందుకో అలాంటి కథలే సెట్ అవ్వలేదు అసలు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పాత్ర చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సెట్స్ పై బిజీగా ఉన్న చిరంజీవి, కొరటాల సినిమాలో మహేష్ అతిథి పాత్రలో నటించబోతున్నాడు. దీనికోసం ఆయనకు భారీ పారితోషికం కూడా ఇస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీనికోసం 30 రోజుల డేట్స్ కూడా ఇచ్చాడు మహేష్. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు కొరటాల శివ. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలు ఇచ్చాడు కాబట్టి ఆయన అడగ్గానే మరో మాట లేకుండా ఓకే చెప్పాడు సూపర్ స్టార్. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తుంది. అందులో 20 నిమిషాలు చిరంజీవి కాంబినేషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ పాత్రలో మహేష్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు పూజా హెగ్డే జోడీగా నటించబోతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ పాత్ర చనిపోతుందని.. అక్కడ్నుంచే కథ అసలు మలుపు తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు ఒకలా ఉన్న కథ మహేష్ పాత్ర ముగిసిన తర్వాత మరోలా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ చిత్రం తెలుగులో మరో కొత్త సంచలనానికి నాందీ పలుకుతుందని.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో కొరటాల అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆగస్ట్ 14న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చూడాలిక.. ఎలా ఉండబోతుందో..?

More Related Stories