English   

రితూ వర్మ ఆ ఇండస్ట్రీలో మాయ చేస్తుందా..

ritu
2020-02-27 20:06:40

తెలుగ‌మ్మాయిలు హీరోయిన్లుగా రారు.. వ‌చ్చినా నిల‌బ‌డ‌రు.. ఇలాంటి క‌మెంట్స్ తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తుంటాయి. కానీ అంజ‌లి.. స్వాతి లాంటి ముద్దుగుమ్మ‌ల నుంచి నిన్న‌మొన్న‌టి రితూవ‌ర్మ వ‌ర‌కు అంతా తెలుగ‌మ్మాయిలే. కానీ వీళ్ల‌కు తెలుగులో మాత్రం ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌రు. కావాలంటే చూడండి.. రితూ హీరోయిన్ గా న‌టించిన పెళ్లిచూపులు.. కేశ‌వ సినిమాలు విజ‌యం సాధించాయి. అయినా ఆమెకు తెలుగులో అవ‌కాశాలు లేవు. కానీ మ‌న హీరోయిన్ ను పిలిచి మ‌రి త‌మిళ‌నాట అవ‌కాశాలిస్తున్నారు. ఆ మధ్య ధ‌నుష్ విఐపి 2తో పాటు విక్రమ్ ధృవ‌న‌క్ష‌త్రంలోనూ హీరోయిన్ గా నటించింది. అయితే గౌత‌మ్ మీన‌న్ తెరకెక్కించిన ధృవ‌న‌క్ష‌త్రం డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. అక్క‌డ దుల్క‌ర్ స‌ల్మాన్ కనులు కనులను దోచాయంటే సినిమాలో నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలవుతుంది. దేసింగ్ పెరియసామి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పైగా రితూవ‌ర్మ‌కు గ్లామ‌ర్ షోలో కూడా ఈమె పెద్ద‌గా అడ్డంకులు చెప్ప‌దు. ఈ సినిమాలో చాలా పద్దతైన అమ్మాయిగా నటించింది రితూ. మ‌రి చూడాలిక‌.. ఈ తెలుగ‌మ్మాయి మిగిలిన ఇండ‌స్ట్రీల‌ను ఎలా చుట్టు ముట్టేయ‌నుందో..?

More Related Stories