English   

దుల్కర్ సల్మాన్‌కు మహానటి ఇమేజ్ ఇంకా పని చేస్తుందా..?

actor
2020-02-27 20:29:06

వాడ‌కం మొద‌లుపెట్టేసారు.. ఒక్క హిట్ వ‌స్తే చాలు.. పాత సినిమాల‌న్నీ తిరగ‌తోడే ఆన‌వాయితీ టాలీవుడ్ లో ఉంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. మహానటితో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో అప్పుడే ఆయన సినిమాల‌పై ప‌డ్డారు కొంద‌రు నిర్మాత‌లు. ఇప్పటికే ఆయన మ‌ళ‌యాలంలో న‌టించిన కొన్ని సినిమాలు తెలుగులో వచ్చాయి. అప్పట్లో సాయి పల్లవి ఇమేజ్ వాడుకోవాలని కలి సినిమాను హేయ్ పిల్లగాడ పేరుతో డబ్ చేసారు. దానికి ముందు ఓకే బంగారం కూడా పర్లేదనిపించడంతో దుల్కర్ కు ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మహానటితో మనోడికి మరింత ఇమేజ్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు దుల్క‌ర్ స‌ల్మాన్ నటించిన కనులు కనులు దోచాయంటే సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. దక్షిణాది భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది ఈ చిత్రం. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ చిత్రం. ఇందులో రితూ వర్మ హీరోయిన్. పెళ్లి చూపులు తర్వాత ఈమెకు కూడా సరైన హిట్ లేదు. ఇలాంటి సమయంలో ఏకంగా మళయాల సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాపైనే రితూ ఆశలు కూడా ఉన్నాయి. ఇక దుల్కర్ కూడా తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రంతో ఏం మాయ జరుగుతుందో చూడాలిక.

More Related Stories