English   

హిట్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

hit
2020-02-28 07:41:45

మాస్ కా దాస్ ఫలక్‌నుమా దాస్‌ అంటూ ఫలక్‌నుమా దాస్‌ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నేడు రిలీజయిన సినిమా హిట్. నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమా ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌ తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చిలసౌ ఫేం రుహానీ శర్మ నటించింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు డాక్టర్ శైలేష్ తెరకెక్కించగా నాని తన అక్క ప్రశాంతితో కలిసి మొదలు పెట్టిన స్థాపించిన వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ ఈరోజు ‘హిట్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా మనకి ఎనిమిదిన్నరకి మొదటి షో పడనుండగా ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పూర్తి కూడా ఆయిఒపోయాయి. ఈ సినిమాను అక్కడ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ప్రేక్షకులను సీట్లకే పరిమితం చేశాడని కామెంట్ చేస్తున్నారు. విశ్వక్‌ సేన్ తన స్థిరమైన నటనలో అదరగొట్టాడని అంటున్నారు. పూర్తి రివ్యూ కోసం వేచి ఉండండి.

 

More Related Stories