బేర్ గిల్స్ తో రజనీ సాహసాలు...ప్రసారం అయ్యేది ఆరోజే

బేర్ గిల్స్‌తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ సాహసాలను చూసేందుకు యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బందిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బేర్ గిల్స్‌తో కలిసి రజనీకాంత్ సాహస యాత్ర చేశారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరిట ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీన్ని మార్చి 23వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్లో ప్రసారం కానుంది.. ఈ ఎపిసోడ్ షూటింగ్ సమయంలో రజనీకాంత్ కు గాయాలయ్యాయి. దీంతో ఒకరోజు పాటు షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని తర్వాత రజనీకాంత్ క్లారిటీ కూడా ఇచ్చారనుకోండి అది వేరే విషయం. ఇక ఇదే షో కోసం గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బేర్ గిల్స్ చేసిన సాహసాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మోదీ తర్వాత ఇండియా నుండి రజనీ మాత్రమే బేర్ గిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు.