English   

అర్జున రెడ్డి డైరెక్టర్ ఇంట్లోకి లిటిల్ ఏంజల్

 Sandeep Reddy Vanga
2020-02-28 10:41:24

అర్జున రెడ్డి సినిమాలో తెలుగులో ఎంత సంచలనం సృష్టించిందో పెద్దగా పరిచయం చేయక్కరలేదు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచింది. హీరో విజయ్ కే కాకుండా దర్శకుడు సందీప్ వంగాకు ఈ చిత్రం తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చింది. ఇక తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ మరోసారి తండ్రయ్యాడు. సందీప్ సతీమణి మనీషా రెడ్డి నిన్న మధ్యాహ్నం ఆడపిల్లకి జన్మనిచ్చింది. 

సందీప్, మనీషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అర్జున్ రెడ్డి సమయంలో ఒక బాబు పుట్టగా ఇప్పుడు  రెండో సంతానంగా పాప జన్మించింది. పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తన సినిమా పేరునే తన కుమారుడుకి పేరుగా పెట్టుకోవడం విశేషం. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. 

More Related Stories