పవన్ సినిమా కోసం బాలీవుడ్ నటుడు

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ మరో పక్క ప్యారలల్ గా రాజకీయాలు కూడా చూసుకుంటున్నారు. అసలు సినిమాలే మానేస్తానన్న ఆయన ఒకేసారి రెండు సినిమాల్ని ప్రారంభించి అందరికీ షాకిచ్చారు. ముందుగా దిల్‌రాజు, బోనీకపూర్‌ల `పింక్` రీమేక్‌ని మొదలుపెట్టిన పవన్ ఆ వెంటనే మరో సినిమాల్ని కూడా అనౌన్స్ చేయడమే కాక షూట్ కి కూడా వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. పవన్ రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించే నటీమణుల విషయంలో కూడా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది.
ఇప్పుడు శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపిస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. దర్శకుడు క్రిష్ కు బాలీవుడ్లో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే పవన్‌తో చేస్తున్న సినిమా పాన్ ఇండియా లెవల్ లో బాగా ఆడించాలి అంటే బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉన్న వారిని తీసుకోవాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.