English   

అప్పుడు బాబాయ్ కి అత్తగా ఇప్పుడు అబ్బాయికి అమ్మగా ..

Nadiya
2020-02-28 17:54:53

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు తాజాగా ప్రచారం మొదలయింది. ఆ విషయం మీద క్లారిటీ రాకున్నా ఇప్పుడు మరో విషయం మీద ప్రచారం మొదలయింది. 

అదేంటంటే ఈ సినిమాలో వరుణ్ తేజ తల్లిగా నదియా నటించబోతోందట. అయితే నిజానికి సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందు ఆ పాత్రకోసం రమ్యకృష్ణను సంప్రదించారు నిర్మాతలు. అయితే రీజన్ ఏమిటో తెలియదు కానీ ఆమె పాత్ర ఇప్పుడు నదియాకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన నదియా ఇప్పుడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్-పవన్ ల బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది సినిమా నుండి ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ అత్తగా కీలక రోల్ చేశారు. దీంతో అప్పుడు బాబాయ్ కి అత్తగా ఇప్పుడు అబ్బాయికి అమ్మగా నటిస్తుందని అంటున్నారు.

More Related Stories