English   

సల్మాన్ ఖాన్ హీరోయిన్ విడాకులు తీసుకుందంట..

Bhagyashree
2020-02-28 18:04:40

ఈ మధ్య మన ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లో కూడా విడాకులు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతీదానికి కూడా విడాకుల వరకు వెళ్తున్నారు సినిమా వాళ్లు. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా విడిపోయింది. కొంకణసేన్ శర్మ విడాకుల గురించి ఇంకా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా తన విడాకుల గురించి మీడియాకు చెప్పింది. ఆమె మరోవరో కాదు.. మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్య శ్రీ. ఒకే ఒక్క సినిమాతో దేశమంతా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది. 

మరీ ముఖ్యంగా వచ్చిన క్రేజ్ యూజ్ చేసుకోలేక.. ఆఫర్ల వేటలో కూడా వెనకబడింది. మైనే ప్యార్ కియా తెలుగులో ప్రేమ పావురాలుగా విడుదలై ఇక్కడా సంచలన విజయం సాధించింది. తెలుగులోనే కాదు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ ఒక్క సినిమాతోనే ఆమె నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజీ హీరోయిన్ అయిపోయింది భాగ్య శ్రీ. కానీ కెరీర్ ప్లాన్ చేసుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత అరకొర అవకాశాలు వస్తున్నా కూడా కాదనుకుని తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.

 అప్పట్లో తను ప్రేమించిన హిమాలయా దస్సానీ కోసం ఇంట్లో వాళ్లను కూడా ఎదిరించింది. ఈమె పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనమే. ఆ తర్వాత భర్తే ప్రాణంగా బతికేసింది. ఇన్నేళ్లుగా అతడితో కలిసున్నా కూడా ఇప్పుడు విడిపోవడం చాలా బాధగా ఉందని చెప్పిన భాగ్య శ్రీ.. తన మసస్సు కుంగిపోయిన సంఘటనలు జరగడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఏడాదిన్నర కిందే తాము విడిపోయినట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది భాగ్య శ్రీ. ఏదేమైనా కూడా ఈమె విడాకుల విషయం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది.

More Related Stories