సమంత, నాగ చైతన్య సొంత నిర్ణయం.. నాగార్జునకు తెలుసా..

పెళ్లి తర్వాత కూడా సమంత వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె కోసం ఇప్పటికీ కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు దర్శకులు. ఒప్పుకుంటే స్టార్ హీరోలు కూడా రొమాన్స్ కు రెడీ అంటున్నారు. రెండేళ్లుగా ఈమె నటించిన ఓ బేబీ, రంగస్థలం, మజిలీ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. యూ టర్న్ సినిమాతో ప్రశంసల దగ్గరే ఆగిపోయిన సమంత.. జానుతో డిజాస్టర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైపోయింది సమంత. ఇన్నాళ్లూ కేవలం నటిగానే సత్తా చూపిస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు నిర్మాతగా కూడా మారిపోతుందని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఆసక్తి పుట్టిస్తున్న విషయం.
ఇందులో నాగ చైతన్య కూడా ఉన్నాడు. చైస్యామ్ కలిసి ANS బ్యానర్ స్థాపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ బ్యానర్ పేరు కూడా రిజిష్టర్ చేయించారు అక్కినేని దంపతులు. ఇందులో తొలి సినిమా కూడా మీడియం బడ్జెట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ బేబీ జరుగుతున్నపుడే తనతో మరో సినిమా చేయాల్సిందిగా సమంతతో నందిని అగ్రీమెంట్ తీసుకుందని తెలుస్తుంది.
అయితే ఓ బేబీ హిట్ అయితే కానీ మరో ఆఫర్ ఇవ్వనని సమంత ముందే చెప్పిందని.. ఇప్పుడు అన్నట్లుగానే సినిమా హిట్ కావడంతో నందిని రెడ్డికి మరో ఆఫర్ సమంత ఇచ్చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇప్పుడు సమంత కోసం సిద్ధం చేస్తుంది నందిని. ఈ కథను నాగచైతన్యతో కలిసి సమంత నిర్మించబోతుంది. అయితే ఇందులో తొలి సినిమా చైతూ స్యామ్ కలిసి నటిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ విషయం నాగార్జునకు ఇష్టముందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.