English   

మహేష్ - చిరంజీవి మల్టీస్టారర్ వెనుక ఇంత కధ ఉందా...

Mahesh Babu Chiranjeevi.jpg
2020-02-29 10:52:07

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఏదయినా హాట్ టాపిక్ నడుస్తుందా అంటే అది చిరు కొరటాల సినిమా అనే చెప్పాలి. అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మహేష్ బాబు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఐతే మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉంది. స్పైడర్ సినిమా తర్వాత చేసిన మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే ఇలాంటి సమయంలో చిరంజీవి సినిమాలో ఒక అతిధి పాత్ర చేయడం సాధ్యమేనా అని పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర ఉందట. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్‌ను అనుకున్నారు. కానీ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యేంత వరకు ఏ సినిమాలో యాక్ట్ చేయోద్దని రామ్ చరణ్‌కు కండి షన్స్ పెట్టాడంతో ఈ సినిమా చేయలేని పరిస్థితి. నిజానికి ముందుగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాను ఈ యేడాది జూలై 31న విడుదల చేద్దానకున్నారు. ఆ తర్వాత దసరాకు చిరంజీవి, కొరటాల శివను షెడ్యూల్ చేసారు. కానీ తీరా  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి అంటే జనవరి 8కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే కదా. అందుకే రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవి నటించే సినిమాలో యాక్ట్ చేయడం లేదు.

ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫంక్షన్ వేదికగా చిరంజీవి, మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో చిరంజీవి సలహా మేరకు ఇపుడు అదే క్యారెక్టర్‌ కోసం దర్శకుడు కొరటాల శివ  మహేష్ బాబును సంప్రదించాడట. చిరంజీవి కూడా మహేష్ బాబుకు పర్సనల్‌గా ఫోన్ చేసి ఈ సినిమా విషయమై అడిగినట్టు సమాచారం.

అంతే కాక మహేష్ పాత్రను గెస్ట్ రోల్ నుండి స్థాయి పెంచి దానిని మల్టీ స్టార్ట్ గా తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’ అనే బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు చాలా తక్కువ కాల్షీట్స్ కేటాయించినట్టు సమాచారం. మొత్తానికి చిరంజీవి, మహేష్ బాబు మల్టీస్టారర్ పై క్లారిటీ రావాలంటే యూనిట్ ప్రకటన ఇవ్వాల్సిందే.

More Related Stories