English   

మరో ట్విస్ట్ ..మహేష్ పరశురామ్ సినిమా వాయిదా 

Mahesh Babu
2020-02-29 10:58:07

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా విషయంలో పెద్ద ట్విస్టు ఇచ్చాడన్న సంగతి తెలిసిందే. ‘మహర్షి’ తర్వాత సుకుమార్ సినిమా చేయాల్సిన మహేష్ ఏమయిందో ఏమో ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి అనిల్ రావిపూడి సినిమాను లైన్లో పెట్టి హిట్ కొట్టాడు. ఈ తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కానీ ఏనాయిందో ఏమో ఆ సినిమా కూడా రద్దయిపోయింది. అందుకే ఇప్పుడు పరశురామ్ ప్రాజెక్టు లైన్ లోకి వచ్చింది. ఈ సినిమాని మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మించనుందని అంటున్నారు. 

అయితే నిజానికి ఇప్పటికే పరశురామ్ చైతూతో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఏమవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంతకుముందు మహేష్‌ను ట్రై చేసి ఫెయిలైన పరశురామ్ నాగచైతన్య సినిమా 14 రీల్స్ ప్లస్ బేనర్లో చేయాల్సి ఉంది. ఇంకో నెల రోజుల్లో షూటింగ్ కూడా మొదలుపెట్టాలనుకున్నారు. కానీ మహేష్ లాంటి పెద్ద హీరోతో పరశురామ్‌కు సినిమా చేసే అవకాశం రావడంతో చైతూతో పాటు 14 రీల్స్ వాళ్లూ అర్థం చేసుకుని ఈ సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. 

అయితే అందుతున్న సమాచారం మేరకు 14 రీల్స్ వాళ్ళు మహేష్ ని రిక్వెస్ట్ చేశారట. అందుకే మహేష్ సినిమా వాయిదా వేశారని అంటున్నారు. ముందు పరశురామ్ చైతూతో సినిమా చేసి అనంతరం అక్టోబర్ నుండి మహేష్ సినిమా షూట్ కి వెళ్లనుంది. అందుకే మహేష్ చిరు కొరటాల సినిమా చేస్తున్నాడని సమాచారం.

More Related Stories