విశ్వక్ సేన్.. న్యూ యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ టాలీవుడ్..

ఇప్పుడు ఒక్కరు కాదు.. అంతా అంటున్న మాట ఇదే. గతేడాది ఫలక్నామా దాస్ సినిమా ఈ సమయంలో మనోడు చేసిన రచ్చ మాములుగా లేదు. లేకపోతే మరేంటి.. ఒక్క సినిమా కూడా హిట్ కాకముందే మనోడి మాటతీరు తేడాగా ఉంది. ఒక్కటి కానీ బ్లాక్ బస్టర్ వచ్చిందంటే కనీసం కంటికి కూడా ఎవరూ కనిపించరేమో మరి..? అంటూ అప్పట్లో విశ్వక్ సేన్ కు చాలా మంది వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ హీరో ప్రవర్తిస్తున్న తీరు అందరికీ షాక్ ఇచ్చింది. ఫలక్నుమా దాస్ సినిమా విషయంలో విశ్వక్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఈ చిత్ర జయాపజయాల విషయం పక్కనబెడితే మనోడు చూపిస్తున్న ఆటిట్యూడ్.. మాట్లాడిన మాటలు కొందరికి నచ్చుతున్నా కూడా చాలా మందికి మాత్రం ఇది సెటైర్లుగా అనిపిస్తున్నాయి.
ఇంత ఆటిట్యూడ్ ఉంటే ఇండస్ట్రీలో ఉండటం కష్టమే అని తరుణ్ భాస్కర్ లాంటి వాళ్లు కూడా ఈ కుర్ర హీరోకు సలహాలు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మాట్లాడే తీరు తెలియనపుడు కచ్చితంగా పాతాళానికి వెళ్లడం ఖాయం. దాంతో ఇప్పుడు ఇవన్నీ తగ్గించుకొని ఈయన నటించిన సినిమా హిట్. నాని నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలన్నీ విశ్వక్ సేన్ దగ్గరుండి చూసుకున్నాడు. నాని తన మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నాడో దాన్ని నిజం చేసి చూపించాడు ఈ హీరో.
ఈ సినిమా విషయంలో ఎక్కడా నోరు జారలేదు. ఆటిట్యూడ్ అస్సలు చూపించలేదు. కాకపోతే తన మాటల్లో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. సినిమా చూస్తున్నప్పుడు మీరు పాస్ పోయడానికి కూడా బయటికి వెళ్లరు అంటూ విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నటుడిగా ఎంత మంచి టాలెంట్ ఉన్న కూడా మాటలు జారితే మాత్రం లేనిపోని తలనొప్పులు వస్తాయని సీనియర్లను చూసి విశ్వక్ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా నటుడిగా మాత్రం చాలా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కు మరో యాంగ్రీ యంగ్ మాన్ దొరికాడని పండగ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.