English   

నాని నిర్మాతగా సక్సెస్ అయ్యాడా.. హిట్ కొట్టాడా..

Nani
2020-02-29 15:03:02

సాధారణంగా నాని హీరోగా నటించిన సినిమాలపై చాలా అంచనాలు ఉంటాయి. కథ చాలా బాగా కుదిరితే తప్ప ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాదు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే నాని అంచనాలు తప్పుతుంటాయి. ఆయన హీరోగా నటించే సినిమాల పైనే ఇంతగా ఫోకస్ చేస్తే ఇక సొంతంగా డబ్బులు పెట్టి తీసే సినిమాల మీద ఫోకస్ చేస్తాడు.. అభిమానులకు ఈ నమ్మకం ఎక్కువగానే ఉంది. ఈయన నిర్మాతగా మారి చేసిన హిట్ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తెలుగులో ఇలాంటి సినిమా ఎప్పుడు మీరు చూసి ఉండరు అని ఫ్రీ రిలీజ్ వేడుకలో నాని చెప్పాడు. ఇక హీరో విశ్వక్ సేన్ అయితే మీరు కనీసం పాస్ కోసం కూడా బయటికి వెళ్ళలేరు అంటూ ఓ రేంజ్లో హైప్ ఇచ్చేశాడు. ఇప్పుడు సినిమా విడుదలైంది. మరి వీళ్ళు చెప్పినంత రేంజ్ లో హిట్ సినిమా ఉందా అంటే సమాధానం మాత్రం మిశ్రమంగా వస్తుంది. 

కొంతమందికి సినిమా చాలా బాగా నచ్చింది.. మరికొందరికి మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు హిట్ బాగానే ఎక్కింది.. కానీ రెగ్యులర్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు అంటూ విమర్శిస్తున్నారు. సినిమా అంత సీరియస్ గా సాగడం.. ఒకే కేసు చుట్టూ స్క్రీన్ ప్లే అల్లుకోవడంతో ఈ తరహా జోనర్ ప్రేక్షకులకు బాగానే నచ్చేలా కనిపిస్తుంది. కానీ ఒక సినిమా హిట్ కావాలంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే నచ్చితే సరిపోదు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తే అది హిట్ సినిమా అవుతుంది. 

నాని నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా కమర్షియల్ గా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కానీ ఆయన చెప్పిన స్థాయిలో మాత్రం సినిమా లేదు. అ.. సినిమాతో రెండు జాతీయ అవార్డులు అందుకున్న నాని ఈ సారి మాత్రం అవార్డుల కంటే కూడా ప్రశంసలు బాగా అందుకుంటున్నాడు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు నాని ఇలాగే నిర్మించాలి అంటూ అభిమానులు కూడా కోరుతున్నారు. అన్నట్లు హిట్ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. 

More Related Stories