English   

నాని జోరు అస్సలు తగ్గడం లేదుగా.. లైన్ లో మరో దర్శకుడు..

nani
2020-02-29 20:05:57

వరుస సినిమాలతో నాని దూకుడు మామూలుగా లేదు. గ్యాంగ్ లీడర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు నాచురల్ స్టార్. ముఖ్యంగా కుర్ర దర్శకులను ఎక్కువగా నమ్ముకుంటున్నాడు ఈయన. నాని కోసం వాళ్లు కూడా కొత్త కొత్త కథలు రాసుకుని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమా చేస్తున్నాడు నాని. ఇది ఆయనకు 25వ సినిమా. ఇందులో విలన్ గా నటిస్తున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయింది కూడా. జూలైలో సినిమా విడుదల కానుంది. ఈ మధ్యే టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ చెప్పిన కథ నచ్చి శ్యామ సింగరాయ్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ మూడు సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాకు కూడా నాని ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వివేక్ ఆత్రేయ చెప్పిన కథ ఇప్పుడు నానికి బాగా నచ్చిందని.. ఆయన దర్శకత్వంలోనే తర్వాత సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఈ కాంబినేషన్ లో గతంలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. మళ్లీ ఇప్పుడు వాళ్లతోనే మరో సినిమా చేయబోతున్నాడు నాని. ఏదేమైనా కూడా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు నాచురల్ స్టార్.

More Related Stories