English   

చిరంజీవికి రైతులతో ఏంటి సంబంధం.. వెళ్లి వైసీపీ నాయకులను అడగండి..

chiru
2020-02-29 20:15:32

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానుల నుంచి వస్తున్న రియాక్షన్ ఇదే. మొన్నటికి మొన్న చిరంజీవి ఇంటిని అమరావతి రైతులు ముట్టడించడంతో అభిమానులు మెగాస్టార్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో లేడు.. అధికారంలో అంతకంటే లేడు.. ప్రజా ప్రతినిధి కూడా కాడు.. మరి ఏం చేయాలని చిరంజీవి ఇంటి ముందు అమరావతి రైతుల దీక్ష చేశారో చెప్పాలంటూ చిరంజీవి అభిమానులు నిలదీస్తున్నారు. వెళ్లి వైసీపీ నాయకుల ఇంటి ముందు గాని.. జేఏసీ నాయకుల ఇంటి ముందు కానీ.. లేదంటే టిడిపి నాయకులను కానీ ప్రశ్నించాలని రాజకీయాలతో సంబంధం లేని చిరంజీవిని ఎందుకు ఇందులో లాగుతున్నారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా చట్టసభల్లో రైతుల గురించి మాట్లాడింది చిరంజీవి ఒక్కడే అంటూ అభిమానులు ఆయనను సమర్థిస్తున్నారు. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు కావాలనే చిరంజీవి ఇంటి ముందు దీక్ష చేసి ఆయన పరువు దిగజార్చాలని ప్రయత్నిస్తున్నట్లు అభిమానులు మండి పడుతున్నారు.

ఇలాంటి పనులు చేసే పబ్లిసిటీ వస్తుందని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజంగా అంత దమ్ముంటే వెళ్లి వైసీపీ నాయకులను అమరావతి రైతులు నిలదీయాలని సలహా ఇస్తున్నారు. అంతే కానీ ఎలాంటి సంబంధం లేని చిరంజీవిని ఇందులో ఎలా ఇరికిస్తారు అంటూ వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఒకసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో మళ్లీ చిరంజీవిని రాజకీయాల్లోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు వైసిపి ఆయనకు ఎంపీ సీట్ ఆఫర్ చేసింది అని ప్రచారం కూడా చేశారు. ఇదే సమయంలో అమరావతి రైతులు ఆయన ఇంటి ముందు ధర్నా చేయడం తమ గురించి మాట్లాడాలని డిమాండ్ చేయడం జరిగాయి. దీనిపై చిరంజీవి ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రాజకీయాల్లో లేని మెగాస్టార్ ఇలా అడగడం ఎంతవరకు సబబు అంటూ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇలాగే ఎంత దూరం వెళుతుందో చూడాలి.

More Related Stories