English   

వాళ్ల దెబ్బకు నయనతార దిగొచ్చేసిందిగా..

nayan
2020-03-01 08:31:47

దక్షిణాది ఇండస్ట్రీలో నయనతార ఇమేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నయనతార ఇమేజ్ ఇంత కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పోటీ పడుతుంటారు. ఒక్కో సినిమా కోసం 5 నుంచి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. సౌతిండియాలో మరే హీరోయిన్ కూడా ఇంత పారితోషికం అందుకోవడం లేదు. అయితే ఇంత చేసినా కూడా ఒక్క సినిమా కోసం చాలా కండీషన్లు పెడుతుంది నయనతార. తమిళ నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మపై చాలా సీరియస్ అవుతున్నారు. ఇన్నేసి కోట్లు తీసుకుని కనీసం ప్రమోషన్ కూడా రాదు అంటూ ఆమెపై మండి పడుతున్నారు. దానికితోడు షూటింగ్ అనుకున్న దానికంటే ఒక రోజు ఆలస్యంగా అయినా కూడా ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తుందని నయనతార పై విమర్శలు ఉన్నాయి. అందుకే నయనతారను సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు తమిళ దర్శక నిర్మాతలు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార కొన్ని రోజులుగా  ఖాళీ అయిపోయింది.

ఇంకా బెట్టు చేస్తే కచ్చితంగా అసలుకే మోసం వస్తుందని గ్రహించిన నయనతార ఇప్పుడు అన్ని సినిమాల ప్రమోషన్ కు వస్తానని నిర్మాతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు గ్లామర్ షో కూడా చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  ఇప్పటి నుంచి తను చేసే ప్రతి సినిమాకి ప్రమోషన్ కూడా వస్తానని నిర్మాతలకు నయనతార చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో వాళ్ళు మళ్ళీ ఆమె వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తన ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. నేను రౌడీనే సినిమా తర్వాత మరోసారి ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాలో సమంత అక్కినేని మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం నయనతార మిగిలిన సినిమాల కంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సరే అది తన ప్రియుడి కోసం చేస్తుంది అనుకోవచ్చు. కానీ ఈ సినిమా ప్రమోషన్ కూడా నయనతార వస్తుందని ప్రచారం జరుగుతుంది. అన్నీ దగ్గరుండి చూసుకుంటానని దర్శకుడు విఘ్నేష్ శివన్ కు నయనతార ధైర్యం చెప్పిందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియుడి సినిమాకు మాత్రం ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ఒప్పుకున్న నయనతార మిగిలిన నిర్మాతలను మాత్రం ముప్పు తిప్పలు పెడుతుందనే విమర్శలను ఈ భామ మూట కట్టుకోవలసి వస్తుంది. అందుకే ఇప్పటి నుంచి అందరినీ సమానంగా చూడాలని ఫిక్సయిపోయింది నయనతార.

 

More Related Stories