English   

రానా.. ఇంతకీ ఆ సినిమాలు విడుదలవుతాయా..

rana
2020-03-01 09:28:37

అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే రానా.. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా తీసుకొని రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడులో కాసేపు కనిపించాడు ఈయన. బాహుబలి తర్వాత నేనే రాజు నేనే మంత్రి, ఘాజీతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ చేసాడు రానా. ఆ ఊపు కొనసాగించడంలో మాత్రం పూర్తిగా వెనకబడి పోతున్నాడు. చేతిలో అరడజను సినిమాలు ఉన్నా ఒక్కటి కూడా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ఇదే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెడుతోంది. హాథీ మేరే సాథీ, 1945 సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు రానా. ఇప్పుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో కూడా విరాట పర్వం సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవితో కలిసి నటించబోతున్నాడు దగ్గుపాటి వారసుడు. ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఏది ఎప్పుడు వస్తుందో రానాకు కూడా క్లారిటీ లేదు.. ఇందులో 1945 చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా.. దాంతో దానికి ఇంకా కొద్దిగా టైం పడుతుందంటున్నారు రానా. సత్య శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రభు సాల్మన్ తెరకెక్కిస్తున్న హాథి మేరీ సాథి నేషనల్ వైడ్ ప్రాజెక్ట్ గా వస్తుంది. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు ఆ మధ్య మరో సినిమా విషయంలో దర్శక నిర్మాతలతో గొడవపడ్డాడు రానా దగ్గుబాటి. ఇదిలా ఉంటే ఈ మధ్య తేజ దర్శకత్వంలో రావణ రాజ్యంలో రాక్షస రాజు సినిమాకు కమిట్ అయ్యాడు. వరస సినిమాలు చేస్తున్నాడు కానీ వాటి విడుదలపై మాత్రం మనసు పెట్టడం లేదు రానా.

More Related Stories