English   

మెగా హీరోలకు నిద్రలేకుండా చేసిన అల్లు అర్జున్..

allu
2020-03-01 09:59:33

ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త రికార్డులు వచ్చినా కూడా అవి మెగా కాంపౌండ్ లోనే ఉండిపోతున్నాయి. బాహుబలి రికార్డులను పక్కనపెడితే మిగిలిన రికార్డులు మాత్రం ఎప్పుడూ మెగా హీరోల చేతుల్లోనే ఉంటున్నాయి. మొన్నటి వరకు కూడా రంగస్థలం పేరు మీద నాన్ బాహుబలి రికార్డులు ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ అన్ని రికార్డులు తిరగరాశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 160 కోట్ల షేర్ వసూలు చేశాడు బన్నీ. దాంతో మనోడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సృష్టించిన రికార్డులు ఇప్పుడు మెగా హీరోలకు నిద్ర పట్టించేలా కనిపించడంలేదు లేదు. రంగస్థలం, సైరా, అత్తారింటికి దారేది ఇలా మెగా హీరోలు గతంలో సాధించిన రికార్డులన్నింటినీ అల్లు అర్జున్ తుడిచి పెట్టేశాడు. దాంతో అందరికీ ఒకేసారి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు బన్నీ. ఇదే ఇప్పుడు మెగా హీరోలకు నిద్రను దూరం చేస్తుంది. ఒకేసారి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకు తన సినిమాతో సవాల్ విసిరాడు అల్లు అర్జున్.

అసలు ఈమధ్య మెగా కుటుంబంతో బన్నీ కాస్త దూరం మెయింటెన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్న తరుణంలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బన్నీ. దాంతో కచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగరాయాలని చూస్తున్నారు చిరంజీవి, రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బన్నీ రికార్డు ఖచ్చితంగా మాయమైపోవడం ఖాయం. అయితే అక్కడ రాజమౌళి అనే రాజముద్ర ఉంది. దాంతో చిరంజీవి సోలోగా వచ్చి అల్లు అర్జున్ రికార్డులు తిరగరాయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందులో మహేష్ బాబు కూడా మరో హీరో. ఇక పవన్ కళ్యాణ్ కూడా మూడు సినిమాలతో వస్తున్నాడు. వీటిలో కచ్చితంగా ఏదో ఒకటి అల్లు అర్జున్ రికార్డులను తిరగరాయడం ఖాయం. ఏదేమైనా కూడా ముగ్గురు మెగా హీరోలకు ఒకేసారి తన సినిమాతో సవాల్ విసిరాడు అల్లు వారబ్బాయి.

More Related Stories