English   

రానా.. నీకు అంత టైమ్ ఎక్కడ దొరుకుతుంది నాయనా..

ranad
2020-03-01 10:13:22

ఇప్పుడు రానా కానీ క‌నిపిస్తే ఇదే మాట అడ‌గాల‌ని చూస్తున్నారు అభిమానులు. లేక‌పోతే మ‌రేంటి.. ఏడాది పొడుగునా సినిమాలు చేస్తూనే ఉంటాడు ఈ హీరో. ఒక్క హీరోగానే కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ బిజీగానే ఉంటాడు రానా. అలాంటి టైమ్ లో కూడా మ‌ళ్లీ సినిమాలు కాద‌ని.. రియాలిటీ షోలు చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌ళ్లీ నెంబ‌ర్ వ‌న్ యారీ అంటూ సీజ‌న్ 3తో వ‌స్తున్నాడు రానా. తాజాగా సీజన్ 3 ప్రోమో విడుదలైంది. అందులో మంచు లక్ష్మితో పాటు నవదీప్ కూడా ఉన్నాడు. వాళ్లు చేసే అల్లరి హైలెట్ అయింది. తొలి ఎపిసోడ్ వీళ్లిద్దరితోనే ఉండబోతుంది.

తొలి రెండు సీజన్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో మ‌రో సీజ‌న్ కు తెర‌లేపారు నిర్వాహ‌కులు. ఇది త్వరలోనే మొద‌లు కానుంది. అల్లు అరవింద్ ఈ మధ్యలో లాంచ్ చేసిన ఆహా యాప్ లో ఈ సీజన్ రాబోతుంది. రెండో సీజ‌న్ లో రామ్ చ‌ర‌ణ్, శ‌ర్వానంద్, వెంకటేష్ లాంటి వాళ్లు వచ్చారు ఇక ఇప్పుడు మూడో సీజన్ మరింత భారీగా ఉండబోతుంది. ఈసారి కూడా సూపర్ స్టార్స్ రాబోతున్నారు. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్త‌యింద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం విరాట పర్వం, అరణ్య సినిమాలతో బిజీగా ఉన్న రానా.. ఆ త‌ర్వాత నెంబ‌ర్ వ‌న్ యారీ మిగిలిన ఎపిసోడ్లు కూడా పూర్తి చేయ‌నున్నారు. ఏదేమైనా సినిమాల‌తో ఇంత బిజీగా ఉండి కూడా మ‌ళ్లీ షోలు చేయ‌డం అనేది మాట‌లు కాదు. అది రానా ఒక్క‌డికే సాధ్య‌మేమో..? 

More Related Stories