English   

అర్థ్ర‌రాత్రి బైక్ మీద హీరోయిన్ తో రౌడీ..ఏం చేస్తున్నాడు

vijay
2020-03-01 12:00:40

విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని  ఫొటోలు లీకయి బయటికి వచ్చాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా దెబ్బ వేయడంతో విజయ్ దేవరకొండ పూరీతో చేసే సినిమా మీద ద్రుష్టి పెట్టాడు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ప్యాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నాడు పూరీ. హిందీ వాటా ఇచ్చేసి మరీ ఈ సినిమాను కరణ్ జోహార్ చేత పెట్టు బదులు పెట్టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఇందులో విజయ్ దేవరకొండతో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ముంబైలో షూటింగ్ చేస్తున్నపుడు కొందరు ఫోటోలు తీసి లీక్ చేసారు. ఇందులో అనన్య పాండే బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని ఉండగా విజయ్ ఆమెతో రొమాన్స్ చేస్తు బైక్ నడుపుతున్నట్టు ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదే ఏడాది సమ్మర్ లో ఈ ఫైటర్ సినిమా విడుదల కానుంది.

 

More Related Stories