English   

పూర్తిగా మారిపోయిన బన్నీ

allu
2020-03-01 12:22:15

మొన్న సంక్రాంతికి అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో అల‌రించిన అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మార్చి మూడో వారం నుండి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం. 40 రోజుల పాటు కేర‌ళ అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ జరుపుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ లో బన్నీ జాయిన్ అవనున్నాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం ఆయన డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. తాజాగా ఆయ‌న‌కి సంబంధించిన ప‌లు లుక్స్ సోష‌ల్ మీడియాలో విపరీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గ‌తంలో ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు సుకుమార్‌- బ‌న్నీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించ‌గా, ఇప్పుడు మూడో సినిమాగా తెరకెక్కుతున్న తాజా సినిమా మీద కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తి అయ్యాక బన్నీ వేణు శ్రీ రామ్ ఐకాన్ సినిమా చేయనున్నాడు.

More Related Stories