English   

పదేళ్ళ నాటి ఆ సినిమాకి సీక్వెల్

nag
2020-03-01 15:12:57

నాగచైతన్య – సమంత ఇద్దరూ కలిసి నటించిన ‘ఎం మాయ చేసావె’ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కాగా నాగచైతన్యకు తొలి హిట్ సినిమాగా నిలిచింది. మరోపక్క సమంత ఏమో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి దశాబ్ద కాలంగా తన హవా కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ్ లో శింబు – త్రిష జంటగా వినయతాండి వరువాయాగా తెరకెక్కించారు. తమిళ్ లో ఈ సినిమా అక్కడి నేటివిటీకి అనుగుణంగా క్లైమాక్స్ విషాదంగా తెరకెక్కించి హిట్ కొట్టారు. రెండు భాషల్లోనూ సినిమా సూపర్ హిట్ అయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ అని చెప్పాలి. ఇప్పుడు తమిళంలో వచ్చి ఆ వెర్షన్ కి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి గౌతమ్ మీనన్ వచ్చాడని అంటున్నారు. ‘విన్నైతాండి వరువాయ 2’కి కథను కూడా సిద్ధం చేశార‌ట‌. శింబు రెడీ అంటే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా వున్నానని ఆయన అంటున్నాడు. ఈ సినిమాలో శింబు జోడీగా ఆయన అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తెలుగులోను సీక్వెల్ ని తెరకెక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

More Related Stories