English   

త్వరలోనే పట్టాల మీదకి బంగార్రాజు

nagarjuna
2020-03-01 15:29:43

‘మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ ఓరిఎంటెడ్  మూవీకి కమిట్ అయ్యాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే వ్యక్తిని ఈ సినిమా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా మలుస్తున్న ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. ఇప్పుడు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన “సోగ్గాడే చిన్ని నాయనా” 2016లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయన్నే ఫైనల్ చేశారట. స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసిన కళ్యాణ్ కృష్ణ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది రోజున ‘బంగార్రాజు’ చిత్రాన్ని మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశాలున్నట్టు సమాచారం.  సోగ్గాడే చిన్ని నాయనలో నటించిన రమ్యకృష్ణ మరోసారి ఇందులో నాగ్ సరసన సందడి చేయనుంది. అయితే నాగచైతన్య సరసన కథానాయిక ఎరనేది ఇంకా తెలియదు.  

 

More Related Stories