English   

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే చస్తాడు : డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

rajni
2020-03-01 15:56:26

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడంతో అంతా ఆయన గురించి వేలెత్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆయన్ని ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తున్నారు. ఇప్పుడు తమిళనాట ఓ దర్శకుడు రజినీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఏకంగా ఆయన చావు వరకు వెళ్లాడు.  ఆయనే ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌.సుందరరాజన్‌. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు తమిళ దర్శకుడు ఆర్‌. సుందర రాజన్‌. రజనీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తుండగా.. ఆయన అభిమానులు నొచ్చుకునేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు డైరక్టర్‌. రజనీకాంత్ పార్టీ స్థాపించి.. తొలిసమావేశం కోయంబత్తూర్లో ఏర్పాటు చేశారనుకోండి.. ఆయన తిరుపూరు వచ్చేలోపు చచ్చిపోతాడు అంటూ కామెంట్స్‌ చేయడం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుందరరాజన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన ఆయన రజనీనే టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎంజీఆర్ కూర్చొన్న సీట్లలో తాము కూర్చోవాలనే ఆలోచన  కొంతమందికి ఎలా వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా స్టాలిన్‌లను కూడా ఆయన టార్గెట్‌ చేశారు. ఏది ఏమైనా తమిళనాట రాజకీయాల్లోకి రజనీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చేస్తున్న వారికీ సుందర రాజన్ చేసిన వ్యాఖ్యలు మింగుడుపడటంలేదు.

 

More Related Stories