English   

సంక్రాంతి సినిమాలతో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

ala
2020-03-02 07:15:21

సంక్రాంతికి ఈ సారి ఇద్దరు సూపర్ స్టార్స్ వచ్చారు. బాక్సాఫీస్ కూడా బద్ధలైపోయింది. ఓ వైపు మహేష్ బాబు.. మరోవైపు అల్లు అర్జున్ పోటీ పడి మరీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించారు. సరిలేరు నీకెవ్వరు అంటూ 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసాడు మహేష్. మరోవైపు అల వైకుంఠపురములో అంటూ అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బన్నీ. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 300 కోట్ల బిజినెస్ చేసాయి. సంక్రాంతి సినిమాలు విడుదలై ఇప్పటికే 50 రోజులు పూర్తి కావడంతో ఒరిజినల్ ప్రింట్స్ కూడా విడుదల చేసారు. అప్పుడు బన్నీ కంటే మహేష్ ఒకరోజు ముందు థియేటర్స్ లోకి వచ్చాడు. జనవరి 11న ఈయన సరిలేరు నీకెవ్వరు విడుదలైంది.. 12న అల వైకుంఠపురములో వచ్చింది. ఇప్పుడు మహేష్ కంటే బన్నీ డిజిటల్ మార్కెట్ లోకి నాలుగు రోజుల ముందు వచ్చాడు. ఫిబ్రవరి 27న అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ సంయుక్తంగా విడుదల చేసాయి. అక్కడ ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. మరోవైపు మార్చ్ 1న సరిలేరు నీకెవ్వరు సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ సినిమాకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇలా అప్పుడు బాక్సాఫీస్ దగ్గర.. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ లో మహేష్, బన్నీ పోరు మాత్రం ఆగడం లేదు. ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ఒక్కో సినిమాకు దాదాపు 15 కోట్లకు పైగానే ఖర్చు చేసారు.

More Related Stories