English   

అఖిల్ అక్కినేని తర్వాత సినిమా ఆయనతోనేనా..

akhil
2020-03-02 08:04:57

ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకు ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు అఖిల్ అక్కినేని. నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. ముఖ్యంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హలో సినిమా కూడా డిజాస్టర్ కావడంతో అఖిల్ బాగా డైలమాలో పడిపోయాడు. మిస్టర్ మజ్ను సినిమా కూడా పర్లేదనే టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఇక తొలి సినిమా అఖిల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుతం ఈయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. నాలుగో సినిమా విడుదల కాకముందే నెక్స్ట్ ఏంటి అని ఇప్పటి నుంచే ఫోకస్ చేశారు అఖిల్ అక్కినేని. ఈ క్రమంలోనే ఇద్దరు ముగ్గురు దర్శకులతో ఆయన మాట్లాడాడు కూడా. తమిళ దర్శకుడు పి ఎస్ మిత్రన్ చెప్పిన కథ అఖిల్ కు బాగా నచ్చిందని ప్రచారం జరుగుతుంది. అయితే కెరీర్ మొదట్లోనే తమిళ దర్శకులతో ప్రయోగాలు వద్దని తండ్రి నాగార్జున చెప్పడంతో అఖిల్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి చెప్పిన ఒక కథ అఖిల్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగులో మంచి విజయం అందుకున్నాడు. అయితే ఇప్పటికిప్పుడు ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ రెడీగా లేరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాలతో మరో ఏడాది వరకు బిజీగా ఉన్నారు. దాంతో అఖిల్ అక్కినేని కోసం సురేందర్ రెడ్డి ఒక కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది. మినిమం గ్యారెంటీ దర్శకుడు కావడంతో అఖిల్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలైన తర్వాత సురేందర్ రెడ్డి సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. అప్పటివరకు ఈ కథకు మరిన్ని మెరుగులు దిద్దాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు.

More Related Stories