English   

దిల్ రాజు మీడియాపై కోపంగా ఉన్నాడా..

Dil Raju
2020-03-02 10:51:18

ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు అవుననే వస్తుంది. దిల్ రాజు సన్నిహితులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈయనకు మీడియా అంటే మండిపోతుందని తెలుస్తోంది. తన గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నది లేనిది కలిపి మసాలా దట్టించి రెండో పెళ్లి గురించి రాయడం ఆయనకు ససేమిరా నచ్చడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై కొందరు మీడియా ప్రతినిధులతో దిల్ రాజు తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈయన రెండో పెళ్లి గురించి కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ ఎప్పుడో మాత్రం చెప్పడం లేదు. అయితే కొన్ని రోజుల కింద ఎవరికీ చెప్పకుండా కేవలం కొందరి సమక్షంలోనే రాజుగారు పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎంతోకాలంగా తనకు తెలిసిన వాళ్లు కూడా ఇలా రాయడంపై ఆయన మండి పడుతున్నాడు.

కొన్ని రోజుల కింద తన ఫ్యామీలీలోని 30 ఏళ్ల మహిళని ఈయన పెళ్లి చేసుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని దీని సారాంశం. అయితే దీనిపై కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అక్కడున్నది అంతా అబద్ధం అని.. రాసిన వార్తలు కూడా అన్నీ బూటకమే అని రాజు సీరియస్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మార్చ్ తర్వాతే దిల్ రాజు రెండో పెళ్లి ఉండొచ్చని తెలుస్తుంది. 

ఉగాది తర్వాత ఈయన ఓ ఇంటివాడు కాబోతున్నాడని వార్తలొస్తున్నాయి. అప్పటి వరకు దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దంటూ ఆయన మీడియాను కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఈయన వరస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ సినిమా రీమేక్ తో పాటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ రీమేక్ నిర్మిస్తున్నాడు దిల్ రాజు. అటు సినిమాలు.. ఇటు పెళ్లి పనులు చేసుకుంటున్నాడు ఈ సీనియర్ నిర్మాత.

More Related Stories