English   

అంచనాలు పెంచేస్తున్న పలాస ట్రైలర్

Palasa
2020-03-02 11:10:45

1978లో పలాస అనే శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఒక ఊరిలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్స్ గా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల ఆరో తారీఖున ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. 

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. నిజానికి ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా వారు యాసని మన సినిమాలలో కేవలం కామెడీ కోసమే ఉపయోగించారు. అక్కడి వాతావరణం ప్రజల జీవనం, అక్కడ ప్రజల మధ్య కనిపించే ఆర్ధిక అసమానతలని ఎవరూ ఎప్పుడూ చూపే ప్రయత్నం చేయలేదు. కానీ పూర్తిగా ఆ ఊరిలో జరిగిన సినిమా కావడంతో ఈ సినిమా ఆ ప్రయత్నం చేసిందని చెప్పచ్చు.ట్రైలర్ మొదలు కావడంతోనే పలాస 1978లో జరిగిన ఓ హత్య గురించి ప్రస్తావిస్తారు. తర్వాత హీరో రక్షిత్ ‘బురదలోకి దిగిపోయాం. 

కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవే.. ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉందే’ అంటూ హీరోయిన్ తో శ్రీకాకుళం యాసలో చెప్పే డైలాగులు సినిమా మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు విలన్ గా నటించడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. జార్జ్ రెడ్డి తిరువీర్, జనార్థన్, ఆరెక్స్ 100 లక్ష్మణ్, గాడ్ - జగదీష్ ప్రతాప్, కంచరపాలెం ఫేం రాజు, అమ్మోరులు ఇతర పాత్రల్లో నటించారు.

More Related Stories