బోయపాటి మూవీ...రంగంలోకి దిగిన బాలయ్య

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా సెట్స్ పైకి గత నెలలోనే వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ఇక ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ ఎట్టకేలకు ఈరోజు ప్రారంభం అయింది. ఈరోజే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలయింది.
హైదరాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. ఆపై వారణాసి నేపథ్యంలో రెండవ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని అంటున్నారు. ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ హీరోయిన్స్ ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం శ్రియ ఓకే అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బహుశా మరికొద్ది రోజుల్లో ఆ విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.