English   

కారణం మల్లీశ్వరి బయోపిక్ కి మహిళా దర్శకురాలు

biopic
2020-03-02 19:45:15

ప్రస్తుతం ఇండియాలో అన్ని బాషలలో హిట్ అవుతూ నిర్మాతలకి కాసులు కురిపిస్తున్న ఏకైక జానర్ బయోపిక్. ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అందునా క్రీడాకారుల బయోపిక్స్ కి ఇంకా క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం లేడీ క్రికేర్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్‌, షట్లర్ సైనా నెహ్వాల్‌, పి.వి సింధు, కపిల్‌ దేవ్, గోపీచంద్‌ వంటి దిగ్గజ క్రీడాకారుల జీవితాలని సినిమాలుగా మలుస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బయిపిక్ కూడా చేరిన సంగతి తెలిసింది. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ మల్లీశ్వరి జీవితగాథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మల్లేశ్వరిని కలిసి హక్కులు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని పాన్‌ ఇండియన్ మూవీగా విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.  శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన కరణం మల్లీశ్వరి చిన్నతనం నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కోని వెయిట్‌ లిఫ్టర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎన్నో జాతీయ.. అంతర్జాతీయ బహుమతులు గెలుచుకోవడమే కాక.. 2000 ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని ఇప్పుడు రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రాజుగాడు’తో దర్శకురాలిగా తెరకు పరిచయమైన సంజన రెడ్డి తెరకెక్కించనుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

 

More Related Stories